ప్రజాశక్తి - బుట్టాయగూడెం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కెఆర్‌పురం ఐటిడిఎలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ, ఐటిడిఎ పరిధిలోని ఉన్నతాధికారులు, గిరిజన నాయకులు, గిరిజనులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పిఒ ఎం.సూర్యతేజ ఎగరవేశారు. వివిధ రకాల గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ఆదివాసీ దినోత్సవానికి ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గిరిజన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ బాలరాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కట్టుబడి ఉందని, వివిధ పథకాల ద్వారా గిరిజన అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. గిరిజన సంఘం నాయకులు మొడియం శ్రీనివాస్, కె.మధు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అమరులకు నివాళులర్పించారు. వారి ఉద్యమ ఫలితంగానే నేడు గిరిజనులకు అనేక చట్టాలు రూపొందించారన్నారు. నేడు గిరిజనులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన చట్టాలు తెలియని అధికారులు ఐటిడిఎలో పనిచే స్తున్నారని, అలాంటి ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. నాలుగేళ్లుగా ఐటిడిఎ పిఒగా ఐఎఎస్ స్థాయి అధికారి లేకపోవడం వల్ల గిరిజన అభివృద్ధి కుంటు పడిందని, ప్రస్తుతం ప్రభుత్వం నియమించడం సంతోషదాయ కమన్నారు. ఇక మీదట అభివృద్ధి జరుగుతుందని ఆశ పడుతున్నామన్నారు.
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘ నాయకులు, గిరిజనలు ప్ల కార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి బొజ్జి, బుట్టాయగూడెం ఎంపిపి కారం శాంతి, జెడ్‌పిటిసి సభ్యులు మొడియం రామతులసి, సర్పంచులు ఎంపిటిసిలు గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంథ మండల కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జాతీయ రహదారిపై ఆదివాసీలతో ప్రదర్శన నిర్వహించారు. ఆదివాసీ చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. స్వయం పరిపాలన హక్కు కల్పించాలని, 1/70, పిసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జిఒ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కట్టం ముత్యాలరావు, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డల ముత్యాలరావు, నార్లవరం ఎంపిటిసి కట్టం రత్తమ్మ, నార్లవరం సర్పంచి మడివి రంగమ్మ, తిరుమ లాపురం సర్పంచి సోడే విజయ పాల్గొన్నారు.
పోలవరం : ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మండలంలోని పోలవరం, సింగన్నపల్లి, పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పోలవరం ప్రజాసంఘాల కార్యాలయం వద్ద మొడియం గంగాదేవి, మండల కార్యదర్శి బొరగం భూచంద్రరావు జెండా ఆవిష్కరించారు. సిపిఎం మండల కార్యదర్శి బొరగం భూచంద్రరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, గంటన్నదొర, మల్లుదొర తదితర యోధుల పోరాట ఫలితంగా గిరిజనులకు అనేక రక్షణ చట్టాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఎస్.సాయికృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శు లు మడివి చలపతిరావు, గిరిజన సంఘం నాయకులు, జోకురి రామకృష్ణ, తామ బాలరాజు, కుంజం ఊలమ్మ, సిహెచ్.కుమార్, కె.శ్రీరామ్, బి.శివ, జి.గణేష్, బి.రాజేష్ పాల్గొన్నారు
గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడా ల్సిన బాధ్యత ప్రతి గిరిజనుడిపైనా ఉందని ఐటిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ గంగు అనిల్ కుమార్ అన్నారు. బుధవారం ఎల్లండిపేట సమీపంలో ఉన్న కోండ్రుకోట పునరావాస కాలనీలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భం గా ఆదివాసీ జెండా ఆవిష్కరించారు. గిరిజన సాంప్రదాయ నృత్యకార్యక్రమాలు నిర్వహించారు.
చింతలపూడి : రాజ్యాధికారం కోసం ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలని ఆదివాసీ నాయకపోడు రాష్ట్ర అధ్యక్షులు అప్పిరెడ్డి నాగు పిలుపునిచ్చారు. యర్రగుంటపల్లిలో బుధవారం ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కాశిన లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు బేతం హనుమంతరావు, బుచ్చిరాజు, రాజా, ఎంప్లాయీస్ యూనియన్ అప్పిరెడ్డి రాము, వెంకటలక్ష్మి, ఎం.రాములు, రాఘవరావు పాల్గొన్నారు.










