ప్రజాశక్తి -యంత్రాంగం
టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టిన రోజు వేడుకలను ఆదివారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు.
భీమునిపట్నం : స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు కె.దామోదరరావు, వానపల్లి సత్య, టి.సూరిబాబు, గరే సదానంద, కనకల అప్పలనాయుడు, గిడుతూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : గాజువాక టిడిపి కార్యాలయంలో నియోజవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యాన కేక్ కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవానికి అచ్చన్నాయుడు పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు విళ్లా రామ్మోహన్‌కుమార్, టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు ఎస్.రతన్‌కాంత్, పార్టీ కార్యదర్శులు గంతకోరు అప్పారావు, సింగూర్ అనంత్, నామాలు పెంటయ్య, వియ్యపు కొండబాబు, గోమాడ వాసు తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం: అచ్చన్నాయుడు జన్మదినం సందర్భంగా సింహాచలం తొలి పావంచా వద్ద విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, 98వ వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వార్డు అధ్యక్షులు పంచదార శ్రీనివాసరావు, సిరిపురం సురేష్, రాజనాల సత్యారావు, బంతి శ్రీను, గుసిడి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదినం సందర్భంగా ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో వేర్వేరుగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నాగ జగదీష్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పీలా గోవింద ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మల్ల సురేంద్ర, కొణతాల రత్నకుమారి, బిఎస్‌ఎన్కే జోగినాయుడు, పెనుమత్స సాయిరాజ్, కోట్ని రామకష్ణ, బోడి వెంకటరావు, బొడ్డేడ మురళి, మల్ల గణేష్, దూలం ప్రసాద్, పోలవరపు త్రినాథ్, సబ్బవరం గణేష్ పాల్గొన్నారు.










