Apr 30,2023 22:23

ప్రజాశక్తి- సామర్లకోట రూరల్‌ విద్యపై పెట్టే పెట్టుబడి ఎప్పటికీ వృథా కాదని ఎపి స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. అచ్చంపేట మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల 95వ వార్షికోత్సవం హెచ్‌ఎం నల్లం అచ్యుత రామచంద్రమూర్తి అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో దొరబాబు మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా సుమారు 800 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల 95 వార్షికోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న హెడ్మాస్టర్‌ నల్లం అచ్చుత రామచంద్ర మూర్తిని దొరబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎలిసెట్టి నరేష్‌, వైస్‌ ఎంపిపి వెంకటరాయుడు, గ్రామ సర్పంచ్‌ వీరం రెడ్డి చినబాబు, మాజీ సర్పంచ్‌ సలాది రమేష్‌ బాబు, సొసైటీ చైర్మన్‌ వీరం రెడ్డి నాని, ఎంఇఒ వై.శివరామకష్ణయ్య, మండల వైసిపి అధ్యక్షుడు తాటికొండ అచ్చిరాజు, ఉప సర్పంచ్‌ విష్ణు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ నక్క లక్ష్మణరావు, ఎస్‌టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాశి, శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు ఎస్‌ఎంసి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.