Nov 11,2023 19:02

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
             స్వతంత్ర భారతదేశం తొలి విద్యా శాఖామాత్యులు, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు శనివారం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ టి.జానకిరామ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జానకిరామ్‌ మాట్లాడుతూ భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరని కొనియాడారు. స్వతంత్ర భారత విద్యావ్యవస్థ అభివృద్ధిలో భారతరత్న జనాబ్‌ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.శ్రీనివాసులు, పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ నారం నాయుడు, డాక్టర్‌ సలోమి సునీత, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ మల్లికార్జునరావు, డిప్యూటీ రిజిస్ట్రార్‌, కిరణ్‌, సూపరింటెండెంట్లు రమేష్‌బాబు, ఆదిత్య పాల్గొన్నారు.