
పార్వతీపురం: జనాబ్ మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనాబ్ మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి పురస్కరించుకొని మైనారిటీ వెల్ఫేర్ డే, జాతీయ ఎడ్యుకేషన్ డే నిర్వహించారు. అబుల్ కలాం అజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం అజాద్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎం.ఉమామహేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీరామ్మూర్తి, మైనారిటీ ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ ఖుదుష్, క్రిస్టియన్ ప్రతినిధులు బిషప్ ఎన్. తిమోతి, ఎన్. సుధీర్ చంద్ర, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాలలో మొట్టమొదటి భారతీయ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడూరు సాయి శ్రీనివాసరావు ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను కొనియాడారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా మొదటి ప్రభుత్వంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేశారని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రముఖుడని చెప్పారు. 11 ఏళ్ల పాటు ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు. ఆయన సేవలు భావితరాలకు ఆదర్శప్రాయమని సాయి శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలో మౌలం అబుల్ కలం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నడుకూరు, బొండ్లపాడులో జనసేన నాయకులు ఎం.పుండరీకం, జనసేన జానీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.