Jul 27,2023 23:48

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జనార్ధన్‌

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంథాలయంలో గురువారం గ్రంధాలయ అధికారి జనార్దన్‌ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం వర్దంతిని ఘనంగా నిర్వహించారు. అబ్దుల్‌ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి జనార్దన్‌ మాట్లాడుతూ, అబ్దుల్‌ కలాం శాస్త్రవేత్తగానూ, భారత రాష్ట్రపతిగా పని చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అప్పలరాజు, సిబ్బంది రమణమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు .

కరాస: జివిఎంసి 52వ వార్డు సంజీవయ్య నగర్‌లో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్ధుల్‌ కలాం 8వ వర్థంతిని అబ్దుల్‌ కలాం ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ షేక్‌ ఖాసిం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. కలాం విగ్రహానికి రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వివి రమణమూర్తి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అబ్దుల్‌ కలాం సేవలు దేశానికి చేసిన సేవలను కొనియాడి, వాటిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మర్రిపాలెం బ్రహ్మకుమారిస్‌ ఇన్‌ఛార్జి బికేె.విమలాదేవి, బికె.పూర్ణచంద్రరావు, పర్వతనేని హరికిషన్‌, వికెవైఎస్‌.మూర్తి, షేక్‌ ఇబ్రహీం, షేక్‌ అబ్దుల్‌ ఖలీఫా, ముత్యాల రవికుమార్‌, ముత్యాల శ్రీలత, లక్ష్మి పాల్గొన్నారు
పిఎం పాలెం: చంద్రపాలెం జెడ్‌పి హైస్కూల్‌లో డాక్టర్‌ అబ్దుల్‌ కలాం విగ్రహానికి పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు నాగోతు సూర్యప్రకాష్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బెల్ల పాపారావు, జగన్మోహన్‌ చౌదరి, బైపల్లి సతీష్‌కుమార్‌, మామిడి వరలక్ష్మి, ఎస్‌సి.రమణ, కాకి నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, కావ్య రెడ్డి పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం విగ్రహానికి ప్రిన్సిపల్‌ సిహెచ్‌ సూర్యప్రసాద్‌, పూలమాలలు వేసి నివాళులర్పించారు అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు పి.వేణుగోపాల్‌, కె ప్రసాదరావు, విద్యార్థులు పాల్గొన్నారు
టిడిపి ఆధ్వర్యంలో... స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో కలాం విగ్రహానికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, కె అప్పలనాయుడు, ఎస్‌ జోగారావు, కె కామేష్‌, ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షులు కెఎస్‌ఆర్‌ కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజాశక్తి-అనకాపల్లి : అబ్దుల్‌ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ళ ప్రవీణ్‌ కుమార్‌, అబ్దుల్‌ కలాం సేవా సంఘం ప్రతినిధి గంగలకుర్తి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా జార్జి క్లబ్‌ దగ్గర వున్న కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విల్లూరి పైడారావు, కోరిబిల్లి రమేష్‌, నరిసే చిరంజీవి, పెతకంశెట్టి జగన్మోహన్‌ రావు, కోటిపల్లి వీరభద్రరావు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని పల్లపు సోమవారం గ్రామంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి గొంతిని శ్రీనివాసరావు ఆధ్యర్యంలో అబ్దుల్‌ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కర్రి దుర్గునాయుడు, గోంతిన నాయుడుబాబు, జెర్రిపోతుల నూకునాయుడు, తెరపల్లి శ్రీను, నారిపల్లి ప్రసాద్‌, తాడేలు సూరిబాబు పాల్గొన్నారు.