ప్రజాశక్తి- చింతూరు
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి వేడుకలను భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నమాణిక్యం, ఇతర సిబ్బంది అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం అత్యున్నత స్థాయికి ఎదిగి దేశానికి, ప్రజలకు సేవ చేయడానికి పేదరికం అడ్డురాదని నిరూపించారని తెలిపారు. భౌతిక శాస్త్రం, ఏరో స్పెస్‌లో ఇంజినీరింగ్ చేసిన కలామ్ డిఆర్‌డిఒ, ఇస్రోలలో పనిచేసి రోహిణి సాటిలైట్, పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి, లాంచ్ వెహికల్స్ విజయవంతానికి కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వై పద్మ, కె శైలజ, యస్ అప్పనమ్మ, రాజబాబు, ఆర్ మౌనిక, పి గౌతమి, రవికుమార్, సరాబంది, రమేష్ పాల్గొన్నారు.










