ప్రజాశక్తి - ముదినేపల్లి
మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం, ఎపియుడబ్ల్యూజె స్తూపం వద్ద ఎంపిపి ఆర్.సత్యనారాయణ, తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల తహశీల్దార్ కె.శ్రీనివాస్, పోలీస్‌స్టేషన్ వద్ద ఎస్‌ఐ డి.వెంకటకుమార్ జెండాను ఎగురవేశారు. సచివాలయం, ఎస్‌సి, బిసి ప్రభుత్వ వసతి గృహాలు, గ్రామంలోని అన్నీ పాఠశాలల వద్ద సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ జెండను ఎగురవేయగా, స్థానిక గ్రంధాలయం వద్ద జడ్‌పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ జెండాను అవిష్కరించారు. స్వామ్ ఐటిఐ వద్ద ప్రిన్సిపల్ కె.సత్యనారాయణ, అన్ని ప్రభుత్వ, ప్రెయివేటు స్కూళ్ల వద్ద ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ జెండాను ఎగురవేశారు.
విద్యార్థులు భారీ ర్యాలీ..
స్థానిక ఇండోసాక్సన్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నవరం రోడ్డులోని స్కూల్ వద్ద నుంచి బస్టాండ్ వరకూ విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా భారతమాతకి జై అంటూ విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ప్రిన్సిపల్ ఎంజె జార్జి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










