Sep 08,2023 23:53

నెమ్మదిగా కదులుతున్న వాహనాలు

ప్రజాశక్తి-అనంతగిరి:అనంతగిరి ఘాట్‌ రోడ్డులో రెండు రోజులుగా రాకపోకల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ఘాట్‌ రోడ్డు శివలింగపురం, టైడా రెండో మలుపు వద్ద గురువారం మధ్యాహ్నం సమయంలో సిమెంట్‌ లోడుతో ఉన్న భారీ లారీ నిలిచి పోవడంతో రాకపోకలకు గంటల తరబడి ఆలస్యం నెలకొంది. మైదాన ప్రాంతం నుండి ఏజెన్సీ ప్రాంతంలో సిమెంట్‌ రవాణా చేస్తున్న తారస్‌ లారీ మధ్యాహ్నం సమయంలో మలుపు వద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిచి పోయింది. దీంతో మైదాన ప్రాంతం నుండి ఏజెన్సీ ప్రాంతంనకు వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో గురువారం నుండి శుక్రవారం మద్యహ్నం వరకు కిలోమీటర్ల రెండు వైపులా వాహనాలు నిలిసి పోయాయి. దీంతో ప్రయాణికులకు గంటల తరబడి ఆలస్యం అయ్యింది. స్ధానిక పోలీసులు ఘటనా స్దాలంలో చేరి గురువారం అర్థరాత్రి నుంచి పొక్లయినర్‌తో రోడ్డు మార్గాన్ని విస్తరణ పనులు చేపట్టారు. శుక్రవారం 12 గంటల నుండి ఒక్కొక్క వాహనాన్ని విస్తరణ చేపట్టిన మార్గం గుండా అనుమతించారు.
ఈ విధంగా ఘాట్‌రోడ్డులో ఎక్కడపడితే అక్కడ లోడుతో ఉన్న వాహనాలు రోడ్డుపై నిలిచి పోవడమే కాకుండా మరికొన్ని అదుపుతప్పి బోల్తా పటిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.