Feb 23,2023 23:50

ఘాట్‌ లో ఇరుక్కుపోయిన లారీలు,

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: పాడేరు ఘాట్‌ రోడ్డులో గురువారం ఉదయం ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు తప్పించు కోబోయే క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఇరుక్కు పోవడంతో ట్రాఫిక్‌ నిలిచి పోయింది. ఘాట్‌ లోని ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద లారీలు ఇరుక్కు పోయి రోడ్డుకు అడ్డంగా నిలిచింది. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు గంటన్నర పాటు పలు వాహనాలు, బస్సులు ట్రాఫిక్‌ లో నిలిచి పోయాయి.