నిలిచి పోయిన వాహనాలు
ప్రజాశక్తి -అనంతగిరి:అనంతగిరి ఘట్ రోడ్డు డమ్ముకు, బొర్రా జంక్షన్ మలుపు వద్ద భారీ కంటైనర్ నిలిచి పోవడంతో వాహనాలు గంటల తరబడి నిలిచి పోయాయి. శనివారం అరకు నుండి విశాఖకు వెలుళున్న క్రమంలో కంటైనర్ మలుపు తిరుగుతున్న వెనుక చక్రాలు గోతిలో దిగాయి. దీంతో మలుపు వద్ద అడ్డంగా కంటైనర్ నిలిచి పోయింది. దీంతో అరకు నుండి మైదాన ప్రాంతానికి వెళ్లే వాహనాలు నిలిచి పోయాయి. డమ్ముకు మీదుగా. కంభవలస.నుంండి బొర్రా జంక్షన్ చేరుకుని ప్రయణికులు రాకపోకలు కొనసాగించారు.










