Oct 06,2023 14:43

ప్రజాశక్తి-కోట : కోట పట్టణంలోని గోపాల్ రెడ్డి విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపును శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వినోద్ కుమార్ రెడ్డిని షావు యజమాని జోషి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.. షాపులోని మందులను, వసతులను వినోద్ కుమార్ రెడ్డి పరిశీలించారు.ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోట మండల ప్రజలకు, ముఖ్యంగా పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించేలా మందుల దుకాణం ఏర్పాటు చేయడం స్వాగతించాలన్నారు. కోట పట్టణం నడిబొడ్డున అందరికీ అందుబాటులో సామాన్య ధరలలో లభ్యమవుతున్నందున సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి వెంటకోట వార్డు మెంబరు పేర్నేటి కిరణ్ కుమార్, రాయపు పోలయ్య,పాల ఉమామహేశ్వర రావు, తదితరులు ఉన్నారు.