Mar 07,2023 22:23

         నిడమర్రు:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన మండల కేంద్రమైన నిడమర్రు, భువనపల్లిలో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కన్వీనర్‌ నారపల్లి రమణారావు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చే నాటికి సిలిండర్‌ ధర రూ.365 ఉండగా ఇప్పుడు రూ.1155కు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరను తక్షణం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నేతలు గవర సత్యనారాయణ, కోన శ్రీనివాసరావు, వెలగలేటి మోహన్‌, కంచం వరప్రసాద్‌ పాల్గొన్నారు.