గుండెను ఆకాశానికి అతికించి
తలను నేలకు తాకించి
కన్నీటిని కలంలోబోసి
ఎవుడు నడగాలో తెలవక
గ్యాస్ బండ బరువు
దింపరో కొడకో! అని అర్జీ రాశా..
పనిలో పనిగా పెరిగిన పెట్రో ఛార్జీలు
ధరలు పెంచి కొంపలంటిస్తున్నాయన్నా..
బరువు తగ్గించి..
గ్యాస్ నింపి బండ ఇచ్చిండు..
మద్యం ధరలు తగ్గించి
ధరలూ తగ్గించానన్నాడు..
ఎంత పల్లెటూరోడినయినా
అట్లా జేస్తార్రా అయ్యా!
గ్యాస్ బరువు దింపమంటే
ధర తగ్గించమని తెల్వలా
ధరలు తగ్గించమంటే
సరుకుల ధరలనిపించలా
మీరు సదువుకున్న
పట్నపోల్లు కదా బిడ్డా!
ఆ మాత్రం ఇంగితం తెల్వదా?
- ఉన్నం వెంకటేశ్వర్లు
87900 68814