
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కొత్తవలస : రైలుప్రమాద సంఘటనలో దెందేరు గ్రామానికి చెందిన గ్యాంగ్‌మేన్ చింతల కృష్ణంనాయుడు మరణించిన విషయం విదితమే. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును గురువారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అందజేశారు. కార్యక్రమంలో కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, నాయకులు మేలాస్త్రీ అప్పారావు, గొర్లె రవి, లక్కవరపుకోట ఎంపిపి గేదెల శ్రీను, దెందేరు సర్పంచ్ వీరోతి వెంకటరమణ, ఎంపిటిసి వెలగల వెంకటరమణ, జామి ఈశ్వరరావు, గవర గణేష్ పాల్గొన్నారు.