Jul 31,2021 09:17

న్యూఢిల్లీ : వాంటెడ్‌ గ్యాంగ్‌ స్టర్‌ కళా జతేదీని ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ విభాగం అరెస్టు చేసింది. గ్యాంగ్‌స్టర్‌పై రూ. 7 లక్షల రివార్డు కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో శుక్రవారం జతేదీని అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీస్‌ ఆఫ్‌ కమిషనర్‌ మనిషి చంద్ర తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌లో ఆయనపై నమోదైన పలు కేసుల్లో వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్నాడని చెప్పారు. ఈ ఏడాది మేలో ఢిల్లీ పోలీసులు జతేదీ గ్యాంగ్‌లోని కొంత మంది అరెస్టు చేశారు.