ప్రజాశక్తి-బొబ్బిలి : ఉపాధ్యాయులే జాతినిర్మాతలని ఆర్‌డిఒ పి.శేషశైలజ, ఎమ్మెల్యే శంబంగి వెంకట అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీ సూర్య రెసిడెన్సీలో బొబ్బిలి రోటరీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు 'జాతి నిర్మాత'ల అవార్డులను అందజేశారు. జెసి రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో నియోజక వర్గ స్థాయిలో ఎంపిక చేసిన పలువురు ఉపాధ్యాయులను ఆర్‌డిఒ, ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ సావు మురళీకృష్ణ, డిప్యూటీ డిఇఒ బ్రహ్మాజీ రావు సన్మానించి అవార్డులను ప్రధానం చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ అంతర్జాతీయ రోటరీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలలో విద్యాభివృద్దికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని అన్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులను, సమాజాన్ని తీర్చిదిద్ధి మార్గదర్శనం చేసే ఉపాధ్యాయులకు జాతి నిర్మాతల (నేషన్ బిల్డర్) అవార్డులను ప్రదానం చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు కార్తీక్, శ్రీ హరి, శ్రీనివాసన్, ప్రవీణ్, రామకృష్ణ, చుక్క శ్రీదేవి, కృష్ణ మోహన్, ఎంఇఒలు త్రినాధ రావు. జి.వాసు , రాజేశ్వరి, సుధాకర్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.










