
ప్రజాశక్తి- ఎచ్చెర్ల : గురువుగా విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు ఈ మూడేళ్లు రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి అందించిన సేవలు గణనీయమని ఒఎస్‌డి సుధాకర్‌బాబు అన్నారు. డైరెక్టర్‌గా మూడేళ్లు సేవలందిస్తున్న జగదీశ్వరరావును అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థులు శుక్రవారం దుశ్శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేసి శ్రీకాకుళం రాజీవ్‌గాంధీ యూనివర్సిటీకి డైరెక్టర్‌గా మూడేళ్లపాటు సేవలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరమై ఉంటుందని చెప్పారు. క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యంపై వారికి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. 'మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ' అనే సూక్తి, తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ ఆసిరినాయుడు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ రవి పాల్గొన్నారు.