Sep 29,2023 21:08

జంబులింగయ్య దంపతులను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
ఉపాధ్యాయ ఉద్యోగ సర్వీసులో ఎంతోమంది విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దిన గురువే మార్గదర్శి అని యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు గోవిందప్ప, మురళీ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఖాసీం, మండల అధ్యక్ష, కార్యదర్శులు బసవరాజు, సురేష్‌ బాబు తెలిపారు. శుక్రవారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రధాన ఎంపిపి పాఠశాలలో 2023-24 సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన యుటిఎఫ్‌ మండల గౌరవాధ్యక్షులు, 4వ వార్డు ఎంపిపి స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ఎం.జంబులింగయ్య, సుజాతమ్మను శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ప్రధానోపాధ్యాయులు జంబులింగయ్య యుటిఎఫ్‌ అభివృద్ధికి తోడ్పడుతూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అవార్డు గ్రహీత జంబులింగయ్య మాట్లాడుతూ... ఉపాధ్యాయునిగా కొనసాగుతున్న తాను యుటిఎఫ్‌లో పని చేస్తూ విద్య, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. యుటిఎఫ్‌ నాయకులు శివ నాగన్న, రూప, వహిదా, రంగనాథ్‌, రామాంజనేయులు, శీను, గోవిందు, నాయక్‌, రంగస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.