Jun 29,2023 21:27

గిరిజన బాలికల పాఠశాల

రాయచోటి : అన్నమయ్య జిల్లాలో12 గిరిజన గురుకుల పాఠ శాలలో ఉన్నాయి. వాటిలో ఒక ఆశ్రమ బాలబాలికలు, ఐదు బాలికల, ఆరు బాలుర పాఠశాల ఉన్నాయి. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 1799 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో బాలికలు 845 మంది, బాలురు 954 మంది ఉన్నారు. గిరిజన గురుకుల పాఠశాలన్నీ కూడా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పరిధిలో నడుస్తున్నాయి. వాటిని ఆ జిల్లా పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షణ చూడాలి ఉంటుంది. కానీ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తు తు న్నాయి. జిల్లాకు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వచ్చే సమ యంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారాలు సమాచారం ఇవ్వడం లేదు. కింద స్థాయి ఉద్యోగులతో తాను మీ జిల్లా వస్తున్నానని, ఏర్పాటు చేయాలని సమాచారం ఇస్తారు. ఆ అధికారి వచ్చేదే సంవత్సరానికి ఒక సారి మాత్రమే. అదీ వచ్చినపుడు రాచమర్యాదలు చేయాలి. వసతితో పాటు ఖరీదైన భోజనాలు సమకూర్చాలి. ఇంతటి భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఆ ఖర్చు అంతా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు భారంగా మారుతోంది. ఇంతా చేసినా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులంటే గురుకుల ప్రిన్సిపల్‌కు ఇచ్చే మర్యాద కూడా ఇవ్వడం లేదని అధికారులు భాధపడుతున్నారు. గత ఏడాది గురుకులంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు నోటిఫికేషన్‌ జారీ, భర్తీ సమయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు కనీస సమాచారం లేకుండా అంతా ప్రాజెక్టు అధికారి నియామకాలు నిర్వహించారనే విమర్శలు వచ్చాయి. ఆ నియామకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోప ణలు వినిపిస్తున్నాయి. నియా మకాలలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కమిటీ సభ్యులు అయినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పలువురు అధికారులు వాపోతున్నారు. నియామకాలలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాది óకారుల పాత్ర లేనట్లు అంతా తానే అయి చేపట్టడంలో అవినీతి జరిగి నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది గురుకుల ప్రిన్సిపల్‌కు భోజ నాలు భాధ్యత ఇవ్వడంతో అక్కడ పనిచేస్తున్న వార్డెన్లు పరిస్ధితి ఆయో మయంగా మారింది. ప్రిన్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ భోజనాలు ఏర్పాటు రెండు పనులు చేయడంలో ప్రిన్సిపల్‌ పనిభారం పెరిగింది. గత ఏడాది ప్రతి బాలికల పాఠశాలలో వాచ్‌ ఉమెన్‌ ఏర్పాటు చేయడం వల్ల జర్నలిస్టు, ప్రజాసంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాలను గురుకుల ఆవరణలోకి పంపడం లేదు. గురుకుల పాఠశాల లోపల ఏమీ జరుగు తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులు అడిందే ఆట పాడిందే పాట ఆన్న చందంగా ఉంది. జిల్లా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు సమస్యలొస్తే కలెక్టర్‌ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అడుగుతారు. జిల్లాలో వున్న గిరిజన గురుకుల పాఠశాల వేళ్ళితే ఐటిడిఎ పిఒకు ఇచ్చే మర్యాద జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారాలు ఇవ్వడం లేదు. ఎందుకు అంటే గిరిజన గురుకుల పాఠశాలలో బిల్లులు మంజూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పరిధిలో ఉన్నాయి. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఏమీ లేకపోవడంతో గురుకులంలో పలకరింపు లేకపోవడంతో అవమానంగా భావిస్తున్నారు. గిరిజన గురుకులంలో అనేక సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వసతుల కల్పించడంలో అధికారులు విఫలం
గిరిజన పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఆఫీస్‌కే పమితమవుతున్నారు. గురుకులాలను విజిట్‌ చేయడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిం చడంలో ఉన్నత అధికారులు నిర్వక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మౌలిక వసతులు కల్పించాలని సర్వేలు చేసి అక్కడున్న సమస్యలను అధికారుల దష్టికి తీసుకుపోవాలి.
- నరసింహ, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ, అన్నమయ్య.
వార్డెన్లు కొనసాగుతున్నారు
జిల్లాలో గిరిజన గురుకుల పాఠశాలలో ప్రస్తుతం వార్డెన్లు అందరూ ఎవరి స్థానంలో వారు విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతా ధికారులు ఇంకా పూర్తిస్థాయిలో ఎక్కడ నియమిస్తారో తెలియదు. వేచి చూడాలి.
- అబ్‌ సలాం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, అన్నమయ్య.రాయచోటి