ప్రజాశక్తి - వినుకొండ : గురుకుల సంక్షేమ పాఠశాలలో లోపాలపై గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి, పల్నాడు జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేస్తానని ఎస్టీ కమిషన్ సభ్యులు వాకడావత్ శంకర్ నాయక్ అన్నారు. ఈనెల 16వ తేదీన స్థానిక గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు సాంబారులో పడి గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మూడవత్ అంజలి బాయిని శంకర్ నాయక్ శుక్రవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పాఠశాలల్లో టీచర్లు, సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించామని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. తొలుత గిరిజన సంక్షేమ ఆయన పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజనం, ఇతర అంశాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్ధార్ కిరణ్‌కుమార్, సిఐ సాంబశివరావు, ఎంఇఒ జఫ్రుల్ల ఖాన్, వార్డెన్లు పాల్గొన్నారు.










