Sep 28,2023 20:44

గెలుపొందిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-వేపాడ : కొత్తవలసలో నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ స్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో బక్కునాయుడుపేట వద్దనున్న గురుకుల విద్యార్థినులు సత్తాచాటారు. అండర్‌-14, 17 విభాగాల్లో జరిగిన అన్ని క్రీడాంశాల్లోనూ ప్రతిభ కనబరిచారు. అండర్‌ - 14లో రేష్మ (100 మీటర్ల పరుగు పందెం), సుజాత (200, 400 మీటర్లు), సిహెచ్‌.కృష్ణవేణి (డిస్కస్‌ త్రో) మొదటి స్థానం సాధించారు. ఖోఖోలో రాధిక, సుజాత, అడుల్స్‌లో తనుశ్రీ విజేతలుగా నిలిచారు. అండర్‌-17లో వై.జానకి (డిస్కస్‌త్రో), డి.శిరీష (అడుల్స్‌), నిహారిక (జావెలిన్‌త్రో)లో మొదటి స్థానం సాధించారు. ఎన్‌.కీర్తి 3 కిలోమీటర్ల రేస్‌ వాక్‌లో ప్రథమ స్థానం సాధించింది. సత్తాచాటిన విద్యార్థులతో పాటు పిఇటి అరుణ, పీడీ ఆదిలక్ష్మిని ప్రిన్సిపల్‌ టి.ఎం.ఫ్లోరెన్స్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఉషారాణి, ఎస్‌.లక్ష్మి అభినందించారు.