May 09,2023 00:37

నరసింహారావును సన్మానిస్తున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-గుంటూరు : ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ చూపినందుకుగాను ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సెక్రెటరీ ఆర్‌.నరసింహారావును పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అభినందించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కొరిటపాడులోని సంస్థ కార్యాలయంలో నరసింహారావును కలిసి సన్మానించారు. పదో తరగతి ఫలితాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్‌మెంట్ల ఆధ్వర్యంలోని పాఠశాలలతో పోల్చితే ఎపి గురుకులాలు 95.25 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేథ్యంలో నరసింహారావుకు కెఎస్‌ లక్ష్మణరావుతోపాటు, టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఇ.మధుసూదన్‌, డాక్టర్‌ పి.వి.మల్లేశ్వర్‌ శుభాకాంక్షలు తెలిపారు.