వంటశాలను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ జయరాం
ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్:బాలయోగి మహిళ గురుకుల పాఠశాలను ఆర్డీవో హెచ్‌ఐవి.జయరాం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం వంటశాలలో భోజనాలను పరిశీలించారు. పిల్లలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కనకారావు, ప్రిన్సిపాల్ సునీత ఉన్నారు.










