వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ సౌమ్య
ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం సీలేరు ఏపీ గురుకుల పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. సీలేరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సౌమ్య విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక విద్యార్థి అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ తదితరు వ్యాధులు బారిన పడకుండా దోమతెరలు వినియోగించుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం, ఇతర వ్యాధులు వస్తే వెంటనే స్థానిక పిహెచ్‌సికి రావాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బుచ్చిబాబు, ఉపాధ్యాయులు, పిహెచ్‌సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










