![](/sites/default/files/2023-11/po_11.jpg)
ప్రజాశక్తి - సీతంపేట : మండలంలోని మల్లి గురుకుల పాఠశాలను ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి గురువారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పలువురు అధికారులకు పాఠశాలల ప్రత్యేక అధికారులుగా నియమించిన నేపథ్యంలో మల్లి గురుకుల పాఠశాలను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సరైన ప్రణాళిక రూపొందించాలని ఉపాధ్యాయ సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి నైపుణ్యాన్ని పరీక్షించారు. బాగా చదివి నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధించాలని సూచించారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
దోనుబాయి ఆశ్రమ పాఠశాల ఎపిఒ తనిఖీ
దోనుబాయి ఆశ్రమ పాఠశాలను ఐటిడిఎ ఎపిఒ వై.రోసిరెడ్డి గురువారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్‌గా పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల భోజనాన్ని పరిశీలించారు. అలాగే విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్ధ్యాలను తెలుసుకొన్నారు. వారి విద్యా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కెసుబ్బారావు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.