ప్రజాశక్తి - టి.నరసాపురం
మండలంలోని అప్పలరాజుగూడెం బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా డిఎస్ బి.శంకరరావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన టి.నరసింహాస్వామి ఉద్యోగ విరమణ పొందగా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా శంకరరావు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.










