
విద్యార్థుల నుంచి సమాధానాలు రాబడుతున్న పిఒ కల్పనాకుమారి
సీతంపేట: మండలంలోని మల్లి గురుకుల పాఠశాలను ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి నైపుణ్యాన్ని పరిశీలించారు. బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధించాన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.