ప్రజాశక్తి - కలిదిండి
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు 62 ఏళ్ల వయస్సులో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న పూర్వ విద్యార్థులు చలించిపోయారు. రూ.70 వేల ఆర్థికసాయం అందజేసి, తమ గురుభక్తిని చాటుకున్నారు. కోరుకొల్లు క్రాంతి హైస్కూల్లో నాడు చదువు చెప్పిన ఉపాధ్యాయుడు ఎస్వి గోపాల్‌కు ఆ నగదును గురుదక్షణగా అందజేసినట్లు కరెస్పాండెంట్ చన్నంశెట్టి కృష్ణ తెలిపారు. పూర్వ విద్యార్థుల సాయంతో పాటు ప్రస్తుత సిబ్బంది, పాఠశాల యాజమాన్యం సాయం అందించడంలో సహకరించారన్నారు. కోరుకొల్లులోని ఉపాధ్యాయుడు ఎస్వి గోపాల్ స్వగృహంలో చన్నంశెట్టి కృష్ణ, లక్ష్మి దంపతులు, పాఠశాల సిబ్బందితో కలిసి అందజేశారు.










