May 08,2023 23:02

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు

 

- గేద, దూడపై దాడి
- చిరుతపులి అంటూ గామస్తుల భయాందోళనలు
- రేసు కుక్కలు అంటున్న అటవీ అధికారులు
ప్రజాశక్తి - గండేపల్లి
గండేపల్లి మండలం ఉప్పలపాడు. గ్రామ శివారు పొలాల్లో పశువులపై గుర్తు తెలియని జంతువు దాడి.. చిరతపులిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. గ్రామంలో. అంకం నూకరాజు. అనే రైతు పశువుల పాకలో ఉన్న లేక దూడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. విషయం తెలిసిన డిఎఫ్‌ఒ ఐ.కవి రాజు, కాకినాడ రేంజర్‌ టి.సత్యనారాయణ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరి శీంచారు. ఇది పులికి సంబంధించిన దాడి కాదని. రేసు కుక్కగా దాడి అయి ఉండవచ్చని, దీనిపై విచారణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ రేంజర్‌ టి.సత్యనారాయణ. మాట్లాడుతూ మీడి యాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. ఈ విష యమై రైతులు, ప్రజలు భయంతో చెందవలసిన అవసరం లేదని సత్యనారాయణ వెల్లడించారు.