గరుగుబిల్లి: మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని రాజువలసకు చెందిన యాళ్ల కిరణ్ (34), గంట నరేష్ రావివలస నుంచి పార్వతీపురం వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢకొీంది. దీంతో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా నరేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారమివ్వగా క్షతగాత్రుడ్ని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కిరణ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మృతితో భార్య ఝాన్సీ, తల్లిదండ్రులు రవణమ్మ, అప్పలనాయుడు కన్నీరుమున్నీరై రోధిస్తున్నారు.