ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్: వార్డుల్లో గుర్తించిన సమస్యలకు సత్వర పరిష్కారం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం నా అడుగు మీ కోసం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 29, 2 వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిల్ సభ్యులతో కలిసి వార్డు సందర్శన చేసి ప్రజలకు అవసరమైన శానిటేషన్, కాలువలు, రోడ్లు, మంచి నీరు సరఫరా, వీధుల్లో పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నదీ లేనిదీ తెలుసుకుని తమ దృష్టికి తెచ్చిన ప్రజల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సైతం అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వార్డుల్లోని సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకొనేందుకు మీముందుకు రావడం జరిగిందని అన్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే వినూత్న కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వార్డులను సందర్శిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్ ఇండుపూరు గున్నేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, స్థానిక కౌన్సిలర్లు యడ్ల త్రినాథ, మంత్రి ఉమామహేశ్వరి, రణభేరి చిన్నం నాయుడు, రణభేరి బంగారు నాయుడు, సువ్వాడ లావణ్య, పట్టణ జెసిఎస్ కన్వీనర్ గొర్లి మాధవరావు, కో ఆప్షన్ సభ్యులు మెరువ వెంకట్రావు, నాయకులు బత్తుల శ్రీనివాసరావు, ఆకుల శ్రీనివాసరావు, సరివిశెట్టి శ్రీనివాసరావు,, వివిధ వార్డుల సచివాలయం కన్వీనర్లు, గృహసారధులు, స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.










