
గుంటూరు జిల్లా విలేకర్లు : సాంస్కృతిక కాలుష్యంపై తన కలం ద్వారా ధ్వజమెత్తి విశ్వనరుడిగా పేరుగాంచిన గుర్రం జాషువా స్ఫూర్తితో ముందుకు సాగాలని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. గుర్రం జాషువా 128వ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని ముగ్గురోడ్డులో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు డి.విజయబాబు అధ్యక్షత వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ 70 ఏళ్ల క్రితమే సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా తన కలాన్ని, గళాన్ని పదును పెట్టారన్నారు. కుల దురంహంకారాన్ని ఆనాడే ఎదిరించి నిలబడ్డారని, అనేక ఆటంకాలు, దాడులను సైతం ఎదుర్కొన్నారని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు మాట్లాడుతూ మూఢనమ్మకాలు, చరిత్ర పట్ల ప్రస్తుతం తప్పుడు ప్రచారం జరుగుతోందని, జాషువా రచనలు అధ్యయనం చేయడం ద్వారా సాంస్కృతిక కాలుష్యాన్ని పారదోలవచ్చని చెప్పారు. పేద, గొప్ప వివిధ రకాల అసమానతలు ఉన్న సమాజాన్ని ఎందుకు సృష్టించారని జాషువా ప్రశ్నించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో బి.వెంకటేశ్వర్లు, కె.కరుణాకరరావు, బి.దుర్గారావు, డివి భాస్కరరెడ్డి, వై.బర్నబస్, ఎ.శౌరిబ ర్తులం, కె.మేరి, కె.బాబూరావు, క్రీస్తుదాసు పాల్గొన్నారు. గుర్రం జాషువా సేవా సమితి కార్యాలయంలో నివాళులర్పించగా డి.సామ్యేలు, బుల్లిబాబు, రవి, బాబు, పి.రాము, టి.వెంకటయ్య, ఎం.డాంగే, ఎం.మల్లేశ్వరరావు పాల్గొ న్నారు. ఉండవల్లిలోని ప్రజాసంఘాల కార్యాలయంలో సభలో సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం.రవి, రజక వృత్తిదారుల సంఘం నాయకులు ఇ.రామారావు మాట్లాడారు. వి.వెంకటేశ్వరరావు, సిహెచ్ సుందరరావు, పి.రాఘవులు, పి.గాంధీ, టి.శివయ్య, యు.పార్థసారథి రాఘవయ్య, పి.బాబురావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలో వి.పున్నయ్య అధ్యక్షతన నివాళులర్పించారు. కెవిపిఎస్ గుంటూరు జిల్లా కన్వీనర్ ఎన్.కిషోర్‌బాబు మాట్లాడారు. ఎ.నాగేశ్వరరావు, వి.కోటేశ్వరరావు, ముసలయ్య, దేవదానం, రాముడు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల కేంద్రంలో విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, మండల కార్యదర్శి జెట్టి బాలరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు ఎన్.యోగేశ్వరరావు, బి.అమ్మిరెడ్డి, ఎ.శ్రీనివాసు పాల్గొన్నారు. మంగళగిరి సిపిఎం కార్యాలయంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య, సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, ఎం.బాలాజీ, ఎం.చలపతిరావు, టి.శ్రీరాములు పాల్గొన్నారు. ఎంటిఎంసి కార్యాలయంలో జాషువా చిత్రపటానికి, రాజీవ్ సెంటర్‌లో విగ్రహానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూలమాలలేశారు. పెదనందిపాడులోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో భగత్‌సింగ్, జాషువా చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. కౌలురైతు సంఘం నాయకులు కె.శివనాగేశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించగా ఎస్‌టియు నాయకులు జి.మోహనరావు, సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి డి.శ్రీనివాసరావు మాట్లాడారు. ఎ.యశ్వంత్, జె.రామారావు, ఎం.వెంకటేశ్వర్లు, సలీం, ఎం.రమణ, సిహెచ్.చిరంజీవి మాష్టారు పాల్గొన్నారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడులోని జెడ్‌పి పాఠశాలలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జయంతి సభ హెచ్‌ఎం సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి సీతారామాంజనేయులు మాట్లాడారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రజానాట్య మండలి నాయకులు మస్తాన్‌వలి మాట్లాడారు. తెనాలి పట్టణానికి చెందిన జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జాషువా విగ్రహానికి పూలమాలలేశారు. సమితి అధ్యక్షులు జె.న్యూటన్ మాట్లాడారు. ఎస్.సుకుమార్, పి.రవికుమార్, జి.సుబ్బా రావు, కె.రమేష్, కె.బెన్హర్, డాక్టర్ ఎ.మల్లేశ్వరరావు, ఎ.నాగేశ్వరరావు, శివప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరు నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, వైసిపి జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర గ్రంధాలయాల పరిషత్ చైర్మన్ ఎం.శేషగిరిరావు, అధికారులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, దళిత సంఘాల నాయకులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. అరంల్‌పేటలోని బీమ్ భారత్ కార్యాలయంలో సభ నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్ మాట్లాడారు. ఎ.శ్యామ్, జె.మోహన్, బి.విల్సన్ పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యుడు షేక్ ఖాశిం షహీద్ అధ్యక్షత సభ నిర్వహించారు. చిత్రపటానికి నాయకులు ఆది నికల్సన్ పూలమాలలేశారు. జాషువా సాహిత్యం, సామాజిక పోరాటాల గురించి ప్రజానాట్య మండలి నాయకులు జి.లూథర్‌పాల్ మాట్లాడారు. ఆంజనేయులు, సత్యనారాయణ, పద్మనాభుడు, మల్లేశ్వరి, ఖాజాబి పాల్గొన్నారు. అరండల్‌పేటలోని అవగాహన కార్యాలయంలో జాషువా జయంతి సభ నిర్వహించారు. బి.అశోక్, కెవికె సుజాత, పి.ఎస్.మూర్తి, మల్లేశ్వరరావు, నారాయణ, వెంకటరమణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని తన క్యాంపు జాషువా చిత్రపటానికి ఎమ్మెల్సీ ఎల్.అప్పిరెడ్డి పూలమా లలేసి నివాళులర్పించారు. అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బి.రవీంద్ర నాథ్, కార్పొరేటర్లు ఇ.వెంకటకృష్ణ, కె.గురవయ్య, నాయకులు పి.శ్రీనివాసరావు, పి.చైతన్య, జి.మధుసూధనరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గుర్రంజాషువా 128వ జయంతిని పురస్కరించుకొని స్థానిక నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, మాజీ మంత్రి, వైసిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ నివాళులర్పించారు. కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్లో జాషువా చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జెసి జి.రాజకుమారి, డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ సిఇఒ మోహనరావు, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ జి.బ్రహ్మయ్య, డిపిఒ కేశవరెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ శ్రావణ్‌బాబు, పశుసంవర్థకశాఖ జెడి వెంకటేశ్వర్లు, సిపిఒ శేషశ్రీ, చేనేత జౌళి శాఖ ఏడీ వనజ, టూరిజం అధికారి నాయుడు పాల్గొన్నారు.