
ప్రజాశక్తి - తణుకు రూరల్
మనుషుల మధ్య సామాజిక అంతరాలను తొలగించడానికి, సమానత్వం నెలకొల్పడానికి అక్షరాన్ని ఆయుధంగా మలచుకున్న కలం వీరుడు, నవయుగ కవి చక్రవర్తిగా పేరుగాంచిన గుర్రం జాషువా అని శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్ర బాధ్యులు పి.దక్షిణామూర్తి అన్నారు. గురువారం గుర్రం జాషువా 128వ జయంతిని పురస్కరించుకుని శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యాక్రమంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ జాషువా గొప్ప దేశభక్తుడని, స్త్రీవాద సాహిత్యాన్ని తన రచనల్లో ప్రతిబింబించేశాడని చెప్పారు. మత మూఢత్వాన్ని, మూఢ నమ్మకాల్ని, కులతత్వాన్ని వ్యతిరేకించాడని, అటువంటి గొప్ప రచయిత ఆశయాల సాధనకు శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గార రంగారావు, సీతారామయ్య, గోపి, కామన మునిస్వామి, అడ్డగర్ల అజయకుమారి పాల్గొన్నారు.