గుర్ల : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్‌పి ఎం.దీపిక గుర్ల పోలీసు స్టేషన్‌ను సందర్శించి, స్టేషను ప్రాంగణం, ప్రాపర్టీ గది, రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది, ఎంఎస్‌పిలతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఎస్‌పి వెంట చీపురుపల్లి డిఎస్‌పి ఎఎస్ చక్రవర్తి, చీపురుపల్లి సిఐ హెచ్. ఉపేంద్ర, గుర్ల ఎస్‌ఐ హరిబాబు నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.