Jul 22,2023 23:34

ఫైరింగ్‌ చేస్తున్న ఎస్‌పి రాధిక

- ఎస్‌పి జి.ఆర్‌.రాధిక
ప్రజాశక్తి- ఎచ్చెర్ల: 
అర్ధ వార్షిక ఫైరింగ్‌ సాధన ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్ల జిల్లా ఆర్మ్డ్‌ రిజర్వు పోలీసు కార్యాలయం పరిధిలోని చిన్నరావుపల్లి ఫైరింగ్‌ రేంజ్‌లో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న పోలీస్‌లకు, సిబ్బందికి ఫైరింగ్‌ సాధన ప్రక్రియ శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌పి జి.రాధిక పాల్గొని స్వయంగా పాల్గొని ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేసి అధికారులలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నిలిపారు. ఈ క్రమంలో ముందుగా ఫైరింగ్‌ సాధన కోసం ఉయోగించే అయధాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వార్షిక ఫైరింగ్‌ జరగుతున్న నేపథ్యంలో ఫైరింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని మంచి మెళకువలు నేర్చుకోవాలన్నారు. అందులో అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క బుల్లెట్టు టార్గెట్‌ వైపే బుల్‌ పడేవిధంగా తర్పీదు పొందాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోలీస్‌శాఖ ఉన్నతి కోసం ముంద డుగు వేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు టి.పి.విఠ లేశ్వరరావు, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.