Oct 07,2023 21:51

ఇటీవల అనంతపురంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని చూపుతున్న ఎస్పీ అన్బురాజన్‌ (ఫైల్‌ ఫొటో)

           అనంతపురం ప్రతినిధి : గంజాయి మత్తు గుప్పుగుప్పు మంటుండగా, గుట్టుగా డ్రగ్స్‌ విక్రయాలు సాగుతున్నాయి. ప్రధానంగా యువత ఈ మత్తులో జోగుతోంది. ఒకప్పుడు జిల్లాలో ఇవి ఉండేవి కాదు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పుడు జోరుగా విక్రయాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రెండు గ్యాంగ్‌లు పోలీసులకు పట్టుబడటం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి ఇదే తరహాలో డ్రగ్స్‌ కూడా గుట్టుగా విక్రయాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖపట్నం టు అనంతపురం
జిల్లాకు ఎంతో దూరంలోనున్న విశాఖపట్నం, పాడేరుల నుంచి అనంతపురం జిల్లాకు ఈ గంజాయి సరఫరా అవుతున్నట్టు పోలీసులు ఇటీవల జరిపిన దాడుల్లో గుర్తించారు. వన్‌టౌన్‌, ఫోర్త్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో 18 మంది గంజాయి సరఫరాదారులను గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి 21 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంత పెద్దఎత్తున గంజాయి జిల్లాలో లభించడం ఇదే ప్రథమం కావచ్చు. గతంలో లభించిన కొద్ది కిలోల్లోపే ఉండేది. దీన్ని కొద్ది మంది పూర్తిస్థాయి వ్యాపారంగా మలుచకుని నిరంతరాయంగా విశాఖపట్నం ప్రాంతం నుంచి తీసుకొచ్చి విక్రయించడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా మొత్తంగానే ఈ బృందాలు విక్రయాలు సాగిస్తున్నారన్న ఆరోపణలునన్నాయి. దీనిపై పోలీసు శాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మడకశిర ప్రాంతంలో తాజాగా గంజాయి పంట పెంపాన్ని గుర్తించడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలో పెద్దఎత్తున సాగు చేసిన దాఖలాలు గతంలో చాలా వరకు తక్కువగా ఉండేది. ఇటీవలి కాలంలో చూస్తే ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీని వినియోగం ఏ మేరకు పెరుగుతోందన్న ఆందోళన నెలకొంటోంది.
గుట్టుగా డ్రగ్స్‌ ?
గుట్టుగా డ్రగ్స్‌ కూడా జిల్లాలో విక్రయాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒకటి, రెండు సందర్భాల్లో కిలోకిపైగా హెరాయిన్‌ జిల్లాలో లభించిన విషయం తెలిసిందే. తాజాగా గంజాయి తరహాలోనే డ్రగ్స్‌కూ విక్రయాల జోరుగా సాగతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లా కేంద్రంగానే ఇవి సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో చదువుకుంటున్న యువత వీటిని వినియోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
బలవుతున్న యవత ?
మత్తు పదార్థాల వినియోగంలో ప్రధానంగా యువతనే ఉంటున్నారు. వీటికితోడు సెల్యూషన్‌, వైటనర్‌, దగ్గు మందులు ఇలాంటివి కూడా వినియోగిస్తున్నారు. వీటిని వాడి వేరొక ప్రపంచంలో ఉన్నట్టు మత్తులో తేలేపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వ