Jul 19,2023 22:33

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులోని రైతుబజార్లు, కూరగాయల మార్కెట్‌లను విజిలెన్స్‌ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. చుట్టుగుంట, బృందావన్‌ గార్డెన్స్‌లోని రైతు బజార్లు, గాంధీపార్క్‌ సెంటర్‌లో కూరగాయల మార్కెట్‌లో విజిలెన్స్‌, తూనికలు-కొలతల శాఖ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించి, తూనికల్లో వ్యత్యాసం, సరైన స్టాంపింగ్‌ లేని పరికాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీహరిరావు, రామచంద్రయ్య పాల్గొన్నారు.