Nov 19,2023 00:37
మాట్లాడుతున్న రైతు నాయకులు

ప్రజాశక్తి-పర్చూరు: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని రైతులు కోరారు. శనివారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో పర్చూరు మండల రైతులు సమావేశం నిర్వహించారు. ఈ నెల 20న పెదనందిపాడులో జరిగే నిరసన దీక్ష కార్యక్రమానికి పెద్దఎత్తున రైతులు తరలి వెళ్లేందుకు నిర్ణయించారు. సమావేశంలో నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్ల రాజమోహనరావు, యార్లగడ్డ అంకమ్మ చౌదరి, కోట హరిప్రసాద్‌, గడ్డిపాటి శ్రీనివాసరావు, ఒగ్గిసెట్టి నరసింహం, తోట శివ, రైతులు పాల్గొన్నారు.