Jul 26,2023 23:33

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : మండలంలోని చినకాకాని పొలాల్లో ఉన్న మురుగునీటి కాల్వ కట్ట అందులోని మురుగు నీరంతా గుంటూరు ఛానల్లో కలుస్తోంది. ఎడతెరిపి లేని వాన కారణంగా ఎన్నారై వద్ద నుంచి వెళ్లే మురుగు కాల్వ కట్టకు బుధవారం గండి పడింది. ఎన్‌ఆర్‌ఐ నుండి వచ్చే మురుగంతా ఈ కాల్వ నుండే వెళ్తుంది. కాల్వ కట్ట దెబ్బతిందని స్థానికులు గతంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గుంటూరు ఛానల్‌ నీటినే గుంటూరు నగరంతోపాటు పలు గ్రామాలకూ తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ ఛానల్‌లో మురుగునీరు కలవడంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.