మంగళగిరి రూరల్: గుంటూరు ఛానల్ లో పేరుకుపోయిన తూటు కాడను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ డిమాండ్ చేశారు. చిన్న కాకానిలో సోమవారం గుంటూరు ఛానల్ ను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ, ఆం ధ్రప్రదేశ్ రైతు సంఘం మంగళగిరి నియో జకవర్గ అధ్య క్షుడు వెంకటేశ్వరరావు సచివాలయం అధికారు లకు, కలెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. తూటుకాడ పూర్తిగా నిండి పోవడంతో వ్యవసాయ పనుల నిమిత్తం ఉప యోగించుకుంటానికి కూడా లేకుండా పోయిందని అన్నారు. గుంటూరు ఛానల్‌లో గుర్రపు డెక్క, తూటు కాడ పేరుకుపోవడంతో అందులోని నీరు మురుగు నీరుగా మారిపోయిందని అదే నీటిని ప్రజలకు తాగు నీరుగా అందిస్తున్నారని, ఆ నీరు కంపు కొడుతోందని అన్నారు. పది రోజుల్లో తూటుకాడను తొలగించని పక్షంలో గ్రామస్తులందరితో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యా లయాలను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. పరిశీలిం చిన వారిలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎ.ప్రభాకర్, జోహార్ జానీ, జె.శంకరరావు, పి.రాధాకృష్ణ, పి. మరియ దాసు పాల్గొన్నారు.










