ప్రజాశక్తి-బాపట్ల
గుంటూరు ఛానల్‌కు వెంటనే నిధులు కేటయించాలని కోరుతూ నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ ఆధ్వర్యంలో సోమవారం స్పందనలో బాపట్ల జిల్లా కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు నాయకులతో కలసి రాజమోహన్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా గుంటూరు ఛానల్‌ను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. బాపట్ల జిల్లాలో పర్చూరు, పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాలతో పాటు బాపట్ల మండలంలో అనేక గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే గుంటూరు ఛానల్ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని అనేకమార్లు ప్రభుత్వాలకు ఎన్నో అర్జీలు పెట్టుకున్నాం. ప్రభుత్వాలు మారుతున్నా గుంటూరు ఛానల్ రూపురేఖలు మాత్రం మారడం లేదన్నారు. గుంటూరు ఛానల్‌కు నిధులు కేటాయించకపోతే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతామని రాజమోహన్ హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో కోట హరిబాబు, అబ్బిసెట్టి నరసింహారావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, కోట రమేష్, దొప్పలపుడి హరిబాబు, గోరంట్ల బాబు, అడ్డగడ్డ వెంకటేశ్వర్లు, కాపు సాంబశివరావు, ఈదర బ్రమరాంభ, తుమ్మల రమాదేవి, కొల్లా రామన్, ఆచంట వెంకట సుబ్బారావు, మన్నవ హరి ప్రసాద్, పోపూరి నాగేశ్వరరావు, మానం విజేత, జిట్టా ప్రమీలరాణి, కారుమంచి విజయకుమార్, మహ్మద్ బాషా, మేకల ప్రసాద్ పాల్గొన్నారు.










