Jul 22,2023 23:14

సమావేశంలో మాట్లాడుతున్న రాజామోహన్‌రావు


ప్రజాశక్తి-పర్చూరు
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించేందుకు నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించారు. గుంటూరు ఛానల్‌ను పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ రైతు పాదయాత్ర చేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్‌రావు తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమోహన్‌రావు మాట్లాడారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించటం వల్ల 50 గ్రామాలకు తాగు, సాగు నీటి అవసరాలు తీరుతాయన్నారు. 80 సంవత్సరాల నుంచి అలుపెరుగకుండా పోరాటం చేస్తున్నామన్న సంగతిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం నాయకులు మన్నం హరిబాబు, కొల్లా రామన్‌, లావు అంకమ్మ చౌదరి, యార్లగడ్డ అంకమ్మ చౌదరి, ఎల్‌.చౌడేశ్వరి, శివనాగేశ్వరరావు, నరశింహారావు, కె. రత్నకుమారి, ఈదర బ్రహ్మయ్య, సుబ్బారావు, విజయకుమార్‌, మహ్మద్‌బాషా, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.