ప్రజాశక్తి - పర్చూరు: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిం చేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఈనెల 22న పర్చూరు కొల్లవారి కళ్యాణ మండపంలో అఖిల పక్ష సాధన సమితి ప్రతినిధులు తెలిపారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు ఆదివారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గుంటూరు ఛానెల్ పర్చూరు వరకు పొడిగిస్తే ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, పర్చూరు మండలాల్లోని 50శాతం గ్రామాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందుతుందని తెలిపారు. నాలుగు మండలాల రైతుల తో సాధన సమితిగా ఏర్పడినట్లు తెలిపారు. సదస్సుకు ఎంఎల్‌సి కెఎస్ లక్ష్మణరావు హాజరవుతారని తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కావాలని కోరారు. నరిశెట్టి ఆచార్యులు, బండి శంకరయ్య, లావు నాగేశ్వరరావు పాల్గొన్నారు.










