Oct 02,2023 22:47

ప్రజాశక్తి-గుడివాడ : స్థానిక న్యూ బైపాస్‌రోడ్డులో ప్రమాద భరితంగా ఉన్న భారీ గుంతలను పూడ్చాలంటూ జనసేన నాయకుడు జనసేన నాయకుడు ఎం. రామకృష్ణ (ఆర్‌.కె.) వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌.కె. వారియర్స్‌ సభ్యులకు కలిసి ఫ్ల కార్డులు చేతబూని రోడ్డు మధ్యలో ఉన్న భారీ గుంతల్లో కూర్చుని ఆర్‌.కె. రోడ్లకు తక్షణం మరమ్మతులు చేయాలంటూ నినాదాలు చేశారు. అత్యంత ప్రమాద భరితంగా బైపాస్‌ రోడ్డులో గుంతలు ఏర్పడటంతో, ప్రమాదాలు జరిగి వాహనదారులు గాయపడుతున్న అధికారులు స్పందించక పోవడం దారుణమని ఆర్‌.కె. ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి చర్యలు చేపట్టకుంటే కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని ఆర్‌.కె. హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో ఆర్‌.కె.వారియర్స్‌ సభ్యులు అయ్యప్ప, చరణ్‌, తదితరులు పాల్గొన్నారు.