వినుకొండ: గుండ్లకమ్మ నదిపై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు లభించాయని, త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చెప్పారు. శనివారం స్థానిక వైసిసి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోకనకొండ-పువ్వాడ, నాగిరెడ్డిపల్లి , అందుగుల,కొత్తపాలెం,గుండ్లకమ్మ నదిపై 150 మీటర్ల బ్రిడ్జిలను నిర్మించ నున్నట్లు తెలిపారు. గుంటూరు-కర్నూలు జాతీయ రహదారి చీకటీగలపాలెం నుండి బోడిచెంబునువారిపాలెం హైవే రోడ్డు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రక్రియ పూర్తయిందని, త్వరలో టెండర్ ద్వారా భూ సేకరణ చేయనున్నట్లు వివరించారు. అకాల వర్షానికి నష్టపోయిన పంట నష్టాన్ని గుర్తించి అంచనాకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వర్షానికి దెబ్బతిన్న పంటను అధి కారులు గుర్తిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సబబు కాదన్నారు. వినుకొండ నియోజకవర్గంలో వర్షానికి నష్టపోయిన పంటను అధికారులు గుర్తిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాను 40 వేల మెజార్టీతో గెలుస్తానని బ్రహ్మనాయుడు ధీమా వ్యక్తం చేశారు.










