తాడేపల్లి రూరల్: ఎంటిఎంసి పరిధిలోని గుండిమెడలో తాగునీటి సమ స్యను పరిష్కరించాలని సిపిఎం తాడేపల్లి మండల నాయకులు పల్లె కృష్ణ కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటలో చేశారు. గ్రామంలో నెలల తరబడి తాగునీటి సమస్య ఉందని అన్నారు. వేసవికాలం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైందని, ఏడాది కాలంగా గ్రామంలోని తాగునీటి పైప్ లైన్లు రిపేరులో ఉన్నప్పటికీ ఏ ఒక్క మున్సిపల్ అధికారి కూడా ఈ సమస్యను పరి ష్కరించే దిశగా చర్యలు చేపట్టలేదని విమర్శించారు. గంటల తరబడి నీటి కుళాయిల వద్ద మహిళలు, వృద్ధులు బిందెలు, బకె ట్లతో ఎదురు చూసే పరిస్థితి నెలకొందని తెలిపారు. మున్సిపల్ అధికారులు. కనీసం వాటర్ ట్యాంకుల ద్వారా అయినా తాగు నీటి సరఫరా చేయడం లేదని విమర్శించారు. తక్షణమే వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయాలని, పైప్ లైన్లకు మరమ్మతులు చేసి చేసి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.










