
ప్రజాశక్తి - నరసాపురం టౌన్
వైసిపి పట్టణ సీనియర్ నాయకుడు, 16వ వార్డు కౌన్సిలర్ గొల్ల జయరాజ్‌సింగ్ బు ధవారం ఉదయం వైఎన్ కళాశాల వాకింగ్ ట్రాక్‌పై వాకింగ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. గాం ధీనగర్‌లో ఆయన స్వగృహం వద్ద జయరాజు సింగ్ మృతదేహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, చైర్‌పర్సన్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. అనంతరం వైసిపి తరపున 16వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది జయరాజ్‌సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.