ప్రజాశక్తి - జీలుగుమిల్లి
గుండె పోటుతో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ మృతిచెందిన ఘటన జీలుగుమిల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఉపాధి హామీ చట్టంలో జీలుగుమిల్లి టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కె.శ్రీనివాస్(48) ఎప్పటిలానే విధులకు బయలుదేరుతుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువులు, స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందారని వైద్యులు తెలిపారు. ఆయన మృతితో ఉపాధి హామీ సిబ్బంది తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంపిడిఒ మంగతాయారు, ఎపిఒ జాన్ వెస్లీ, ఉపాధి హామీ సిబ్బంది మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. గతంలో దేవరపల్లిలో పనిచేసి జీలుగుమిల్లికి వచ్చినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అనంతరం మృతదేహాన్ని తాళ్లపూడిలోని ఆయన స్వగృహానికి తరలించారు.










