మరణించిన సావిత్రి
ప్రజాశక్తి-కొమరాడ : గుండెపోటుతో కెజిబివి ఉద్యోగి హిమరిక సావిత్రి మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలో దేవకోన పంచాయతీ అంటివలస గ్రామానికి చెందిన హిమరిక సావిత్రి (33) మెంటాడ మండలంలో కెజిబివిలో కొన్నేళ్లుగా అటెండర్‌గా పనిచేశారు. కొమరాడ కెజిబివికి బదిలీ కావడంతో మంగళవారం స్థానికంగా విధులకు హాజరయ్యారు. అనంతరం కన్నవారైనా కోమట్లపేట గ్రామానికి చేరుకొన్నారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో కూనేరు రామభద్రపురం పిహెచ్‌సికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి, పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చేర్చిన వెంటనే ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సావిత్రికి ఇద్దరు కుమారులున్నారు.










